kalikiri yellamma jatara 2024 dates :
కలికిరి ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు
ఊరేగింపు, సిద్ధపూజ, బోనాలు, 28న రాత్రికి లంకాద హనం, పుష్పపల్లకి ఊరేగింపు, 30న పార్వేటోత్సవం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి దాదాపు లక్షన్నర మంది భక్తులు ఈ జాతరకు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి రైలు, బస్సు మార్గాల్లో అన్నమయ్య జిల్లా కలికిరికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఆలయానికి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలుంటాయి. తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
అన్నమయ్య జిల్లా కలికిరిలో ఎల్లమ్మ అమ్మవారు శక్తి స్వరూపిణిగా భక్తుల పూజలందుకొంటోంది. తిరుపతి గంగమ్మ జాతర తరువాత చెప్పుకోదగిన స్థాయిలో కలికిరి ఎల్లమ్మకు ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 27 నుంచి అవి జరగనున్నాయి. ఎల్లలు కాపాడే మేవత కాబట్టి ఎల్లమ్మ కలికిరి గ్రామం నుంచి కొందరు వ్యాపారం నిమిత్తం కర్ణాటక రాష్ట్రం వెళ్లేవారు. ఒకసారి ఓ వ్యక్తి కలలో ఎల్లమ్మ కనిపించి వారితో పాటు ఊరికి వస్తానని చెప్పింది. అనంతర పరిణామాలలో గంగి రెడ్డి అనే వ్యక్తి తన పాలంలో అందరి సహ కారంతో నూట యాభై ఏళ్ల క్రితం అమ్మవా రికి ఆలయం నిర్మించారు. గర్భగుడిలోని అమ్మవారి మూల విగ్రహానికి కుడి పక్కన అంకాళమ్మ, ఎడమ వైపున గంగమ్మ ఉత్సవ విగ్రహాలు కొలువు తీరి ఉంటాయి. రేణుకా దేవి అవతారమైన ఎల్లమ్మ శిరోరూపంలోనే ప్రతిష్ఠితమైంది. ఏటా ఆషాడ శుక్లపక్ష ఏకాదశి ఘడియలకు సమీప శనివారం ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు మొదలై నాలుగు రోజుల పాటు కనులపండువగా సాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 27న జాగ రణ, అమ్మవారి కథా కాలక్షేపం, 28న
ఉత్సవం