Law Cet Counselling 2024 Date : : లాసెట్, పీజీ లాసెట్ అడ్మిషన్ల కౌన్సె లింగ్ ఆగస్టు 5 నుంచి మొదలవుతుంది. ఉన్నత విద్యామం డలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నేతృత్వంలోని 'సెట్' ప్రవే శాల కమిటీ సమా వేశం సోమవారం మండలి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కౌన్సెలిం గ్ షెడ్యూల్ను విడుదల చేశారు. బుధవారం లాసెట్ కౌన్సెలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సమా వేశంలో మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ వి. వెంకటరమణ, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, సెట్ కన్వీనర్ పి. రమేష్బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 11 లా కాలేజీలు ఈ కౌన్సెలింగ్లో పాల్గొంటాయి. వీటిలో మూడేళ్ల లా కోర్సులో 4,790 సీట్లు, ఐదేళ్ల లా కోర్సులో 2,160, ఎల్ఎల్ఎంలో 990 సీట్లున్నాయి
ఉద్యోగ సమాచారం :
ఎన్టీపీసీలో నాన్ ఎగ్జిక్యూటివ్లు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)కు చెందిన నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ (ఎన్ఎంఎల్), జంషెడ్పుర్.. 144 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మైనింగ్ ఓవర్మ్యన్: 67
మ్యాగజైన్ ఇన్ఛార్జ్: 09
మెకానికల్ సూపర్వైజర్: 28 ఎలక్ట్రికల్ సూపర్వైజర్: 26
• ఒకేషనల్ ట్రెయినింగ్ ఇన్స్ట్రక్టర్: 08
జూనియర్ మైన్
సుపీరియర్: 03
మైనింగ్ సర్దార్: 08
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా (మెకానికల్/ మైనింగ్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ప్రొడక్షన్)తో పాటు పని అనుభవం.
వయసు: 05-08-2024 నాటికి 30 ఏళ్లు. ఒకేషనల్ ట్రెయినింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్- సర్వీస్మెన్ అభ్యర్ధులకు పదేళ్లు గరిష్ఠ పరిమితిలో మినహాయింపు ఉంటుంది.
వేతనం: నెలకు మైనింగ్ సర్దార్ పోస్టుకు రూ.40,000, మిగిలిన ఖాళీలకు రూ.50,000.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05-08-2024. 3໖໖໖: https://ntpc.co.in/https://ntpc.co.in/