yadagirigutta temple timings. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 3 -00 గంట
లకే తెరవబడుతుంది.రాత్రి 9-00 గంట లకు ఆలయాన్ని
మూసివేస్తారు.
సుప్రభాతం సేవ - ఉదయం 3-30 నుండి 4-00 గంటల వరకు
తిరువారాధన - ఉదయం 4-00 నుండి 4-30 వరకు
బాల బోగం - ఉదయం 4-30 నుంచి 5-15 వరకు
నిజాభిషేకం - ఉదయం 5-15 నుంచి 6-15 వరకు
శతఘటాభిషేకం - ఉదయం 5-15 నుండి 7-00 వరకు
అమ్మవారికి సహస్ర నామార్చన, - ఉదయం 6-15 నుండి 7-00 వరకు
ఉదయం 7-00 నుండి 9-00 వరకు దర్శనం (అన్నీ)
సుదర్శన నారసింహ హోమం - ఉదయం 7-15 నుంచి 9-30 వరకు
నిత్య కల్యాణోత్సవం - ఉదయం 9-45 నుంచి 11-30
ఉదయం 9-00 నుండి 10-00 వరకు VIP బ్రేక్ దర్శనం
ఆంజనేయ స్వామి ఆకు పూజ (ప్రతి మంగళవారం) ఉదయం 9-00 నుండి 11-00 వరకు
ఉదయం 10-00 నుండి 11-45 భక్తులకు స్వామి వారి దర్శనం
మహారాజ భోగం. ఉదయం 11-45 నుంచి 12-30 వరకు
మధ్యాహ్నం 12-30 నుంచి 3-00 భక్తులకు స్వామి వారి దర్శనం
ద్వారబంధనము - మధ్యాహ్నం 03-00 నుండి 04-00 వరకు
4గంటల నుండి 5 గంటల వరకు VIP బ్రేక్
సాయంత్రం దర్శనాలు
సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు సర్వదర్శనం
రాత్రి 7 గంటల నుండి 7 :30 వరకు తిరు ఆరాధన
రాత్రి 7:30 నుండి రాత్రి 8:15 వరకూ స్వామీ వారి సహస్ర నామార్చన
8:15 నుండి 9:15 వరకు సర్వదర్శనలు ఉంటాయి.
9:15 నుండి 9:45 వరకు స్వామి వారికి ఆరగింపు
9 :45 నుండి 10 :00 వరకు శయనోత్సవం
తరువాత ద్వారా బందనం ఆలయాన్ని మూసి వేస్తారు.
How to reach yadagirigutta యాదగిరిగుట్ట ను ఎలా చేరుకోవాలి.
యాదగిరిగుట్టను బస్సు రైలు విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చును. యాదగిరిగుట్టను చేరుకోవడానికి 4 సులువైన మార్గాలు ఉన్నాయి.
By road రోడ్డు మార్గం ద్వారా : యాదగిరిగుట్టను సొంత వాహనంలో గాని లేదా బస్సులో గాని చేరుకోవాలనుకునే ప్రయాణికులు హైదరాబాదు నుండి అలాగే సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుండి ప్రతి ఒక్క గంటకి మనకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. యాదగిరిగుట్ట హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు బస్ టికెట్ ఛార్జ్ వచ్చేసి 90 రూపాయలు.
By Train రైలు మార్గం ద్వారా : యాదగిరిగుట్టకు రైలు మార్గం ద్వారా చేరుకోవడానికి ఇండియన్ రైల్వే పలు సర్వీస్లను అందిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి భువనగిరి రైల్వే స్టేషన్ కి అలాగే యాదాద్రి రైల్వే స్టేషన్ కి ట్రైన్లు అయితే నడుస్తాయి. రైల్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మరియు ఏసీ క్లాస్ లను బట్టి రేట్లు టికెట్ చార్జెస్ అయితే 60 నుంచి 500 వరకు అయితే నిర్ణయించారు. ప్రతిరోజు ఈ ట్రైన్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ కింద ఇవ్వబడిన అటువంటి ట్రైన్లు ప్రతిరోజు సికింద్రాబాద్ నుండి యాదగిరిగుట్టకు చేరుకోవడానికి సర్వీస్ ని అందిస్తున్నాయి.
By Air విమాన మార్గం : యాదగిరిగుట్ట దేవస్థానాన్ని విదేశాల నుండి అలాగే వివిధ రాష్ట్రాల నుండి చేరుకోవడానికి దగ్గర్లో ఉన్నటువంటి విమానాశ్రమం శంషాబాద్ airport. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి యాదగిరిగుట్టకు 89 కిలోమీటర్లు.
ఎయిర్ పర్ట్ నుండి టాక్సీ ద్వారా
ఒక గంట ప్రయాణంలో యాదగిరిగుట్టని చేరుకోవచ్చు .
Yaden Gupta Temple VIP Darshan tickets. యాదగిరిగుట్ట విఐపి దర్శనం టికెట్ ధరలు. యాదగిరిగుట్ట శీఘ్ర దర్శనం టికెట్లు 150 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో పొందవచ్చును. https://yadadritemple.telangana.gov.in/
ఈ వెబ్సైట్ కి వెళ్లి మీరు ఆన్లైన్లో టికెట్ల బుక్ చేసుకోవచ్చు.
యాదగిరిగుట్టలో భక్తులు, కొత్తగా కొనుగోలు చేసిన మీ యొక్క వాహనాలను పూజ చేయించుకోవడానికి స్కూటర్ కి 300 రూపాయలు, ఆటో కి 400 రూపాయలు, కారు కైతే 500 బస్సు లారీ వ్యాన్ వంటి వాహనాలకు ₹1000 టికెట్ చార్జింగ్ అయితే నిర్ణయించారు.
ఇక శాశ్వత నిత్య పూజ 10 సంవత్సరాల గాను 15 వేల రూపాయలుగా నిర్ణయించారు. సహస్రనామార్చనకు కూడా 15000 రూపాయలు నిర్ణయించారు. దర్బార్ చేయకు 516 రూపాయలు సత్యనారాయణ స్వామి వ్రతానికి 800 రూపాయలు సుప్రభాత సేవకు 100 రూపాయలుగా రేట్లు నిర్ణయించారు.
యాదగిరిగుట్టలో రాత్రి వేళల్లో భక్తులు పడుకోవడానికి కొండ కింద రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి.
లక్ష్మీ నిలయాన్ నాన్ ఎసి గదికి 560 రూపాయలు. మరియు డీలక్స్ రూమ్ కి అయితే 1000 రపాయలు.
అలాగే కళ్యాణ కట్ట వద్ద భక్తులు ఉండడానికి కంపార్ట్మెంట్ రూములు డార్మిట్ రూములు కూడా ఆలయ కమిటీ నిర్మిస్తుంది.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా సుఖ దర్శనం అవ్వడానికి ఆలయ కమిటీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.
యాదగిరిగుట్ట అన్నప్రసాదం yadagirigutta free food
యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల కోసం ఉచిత అన్నదానాన్ని సమకూరుస్తుంది యాదగిరిగుట్ట టెంపుల్.
సూచి శుభ్రమైన రుచికరమైనటువంటి అన్న ప్రసాదాలను భక్తులకు ప్రతిరోజు అందిస్తుంది యాదగిరిగుట్ట టెంపుల్.
యాదగిరిగుట్ట కొండపైకిఉచితబస్సులు: యాదగిరిగుట్ట బస్ స్టేషన్ నుండి అలాగే కళ్యాణకట్ట నడి స్వామివారిని దర్శించుకోవడానికి కొండమీదికి వెళ్ళడానికి ఉచితంగా బస్సులను నడిపిస్తుంది. ఎలాంటి రుసుము చెల్లించకుండా కొండపై నుండి అలాగే కొండ దిగకు ప్రయాణం చేయవచ్చును. ఈమధ్య కాలం నుండే ఆటోలను కూడా కొండపైకి అనుమతిస్తున్నారు అలాగే రుసుము చెల్లించి ఆటోల ద్వారా కూడా కొండపైకి చేరుకోవచ్చు.
Best places to visit near yadagirigutta యాదగిరిగుట్ట దగ్గర్లో చూడాల్సిన మరిన్ని దేవాలయాలు.
యాదగిరిగుట్ట దగ్గర్లో చూడాల్సినటువంటి కొన్ని సుందరమైన ప్రదేశాల్లో కుందా సత్యనారాయణ కళాధామం, యాదగిరిగుట్ట . బోనగిరి కిల్లా, స్వర్ణ గిరి టెంపుల్ మానేపల్లి హిల్స్ బోనగిరి. కొలనుపాక జాయిన్ టెంపుల్. బోనగిరి గురు రాఘవేంద్ర టెంపుల్. ఇవి యాదగిరిగుట్ట ఆలయానికి దగ్గరలో ఉండే మరికొన్ని సందర్శించాల్సినటువంటి ప్రదేశాలు.