వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ టైమింగ్స్ vellore golden temple timings

వెల్లూరు గోల్డెన్ టెంపుల్ తమిళనాడు రాష్ట్రంలో శ్రీపురంలో కొలువై ఉంది. చిత్తూరు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుండి 135 కిలోమీటర్ల దూరం లో ఈ ఆలయాన్ని మనం చేరుకోవచ్చు . ఈ ఆలయం 100 ఎకరాల విశాలమైనటువంటి ప్రాంగణంలో నిర్మించబడింది.
1500 కిలోల బంగారాన్ని ఉపయోగించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. 400 మంది శిల్పులు ఆరు సంవత్సరాల పాటు కష్టపడి నిరంతరాయంగా పనిచేసే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కట్టడానికి 600 కోట్ల రూపాయలు ఖర్చయిందంట. ఈ ఆలయానికి మూడు వైపులా నీరు ఒకవైపు ద్వారం ఉంటుంది. ఈ ఆలయాన్ని ఆకాశం పై నుండి చూస్తే శ్రీచక్రం తరహాలో కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఆ ఊరి యొక్క ఈ దేవాలయం పేరుగా మార్చుకున్నారు అంట. ఈ ఆలయం లోపలికి వెళ్లడానికి ఏడు ద్వారాలు ఉంటాయి. మానవుడు ఏడు జన్మలు దాటుకొని ఉత్తి పొందుతాడు అనే సూచిక మీద ఈ ఏడు ద్వారాలను నిర్మించారంట. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక ద్వారం నుండి అమ్మవారిని చేరుకోవడానికి గంట నుండి గంట నర వరకు సమయం పడుతుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళుతున్నటువంటి సమయంలో గోడల కిరివైపులా భగవద్గీత ,కురాన్ ,బైబిల్ వంటి ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు పొందుపరిచారు ఈ ప్రవచనాలను చదువుకుంటూ మనం ముందుకు సాగవలసి ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు క్యూ లైన్ లో వెళ్ళవలసిందే ప్రత్యేకంగా VIP దర్శనాలంటూ అంటూ ఏమీ ఉండవు. ప్రతిరోజు 7:30 నుండి రాత్రి 8 గంటల వరకు అమ్మవారికి దర్శించుకోవచ్చును. అమ్మవారిని దర్శించుకోవాలనుకున్నటువంటి భక్తులు తప్పకుండా సాంప్రదాయ దోస్తులు మాత్రమే ధరించి లోపలికి వెళ్ళాలి లేదంటే లోపలికి అనుమతించారు. ప్రతి శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ దేవాలయం గోడలతోటి వదులుకొని దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహమూర్తులను బంగారం తోటే నిర్మించారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో ఈ ఆలయాన్ని వందల మంది రక్షకబటులు పర్యవేక్షిస్తుంటారు. విశాలమైనట్టువంటి ఆలయ ప్రాంగణంలో వేలాది మొక్కలు పచ్చని ఉద్యానవనాలతో ఉంటుంది. ఈ ఆలయం 27 ఆగస్టు 24 న ప్రారంభించబడింది. ప్రతిరోజు ఈ ఆలయాన్ని 20వేల మందికిపైగా సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో నికి ఎలాంటి  ఫోటోలు తీసుకోవడం కానీ వీడియోలు తీసుకోవడం కానీ అనుమతించారు.మీ మొబైల్ ఫోన్లను మీ యొక్క పాదరక్షాలను కౌంటర్లు అప్పగించాల్సి ఉంటుంది. 


Velpur golden Temple timings : 

ప్రతిరోజు అభిషేకం - ఉదయం 4:00 నుండి 8:00 వరకు

ప్రతిరోజు సాధారణ దర్శనం - ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 వరకు

ప్రతిరోజు ఆరతి సేవ - సాయంత్రం 6:00 నుండి 7:00
 వరకు 

How to reach Vellore golden Temple వెల్లూరు స్వర్ణ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ?

మీరు దేశంలో ఎక్కడ ఉన్న గాని ముందుగా వేల్లూరు రైల్వే స్టేషన్ కి చేరుకోవాలి అక్కడి నుండి ఆటో ద్వారా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.




Previous Post Next Post