సంఘీ దేవాలయం హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ దగ్గరలోని సంగీత్ నగర్ లో ఉంది. సంఘీ టెంపుల్ హైదరాబాదు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పచ్చని పొలాలు ప్రశాంతమైన గాలి వాతావరణం కలిగిన అనంతగిరి కొండపైన ఈ సంఘీ దేవాలయాన్ని నిర్మించారు. 1991లో సంఘీ గ్రూప్ ఆఫ్ కంపెనీ శ్రీ జయేంద్ర సరస్వతి గారి ఆధ్వర్యంలో నిర్మించారు. కేవలం 18 నెలల్లోనే ఈ ఆలయాన్ని పూర్తి చేయడం విశేషం. జోల చాణిక్య నిర్మాణ రీతిలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తయిన కొండపై నిర్మించడం వలన చాలా దూరం నుండే భక్తులను కనువిందు చేస్తుంది. ఈ ఆలయం దగ్గరికి చేరుకోగానే ఎంతో ఆహ్లాదకరమైన ప్రశాంతమైనటువంటి అనుభూతిని భక్తులు పొందుతారు.
విశాల వాతావరణంలో కట్టబడిన ఈ దేవాలయంలో 15 అడుగుల ధ్వజస్తంభం భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ గణపతి దేవాలయం తో మొదలుకొని ,పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మండపం ,శివాలయం
సీతారామాలయం, దుర్గా మందిరం, నవగ్రహ మండపం అష్టలక్ష్మి దేవాలయం, హనుమంతుడి మండపాలతో, భక్తులకు దర్శనమిస్తుంటారు ఇక్కడ దేవత మూర్తులు.
యజ్ఞాలు యాగాలు చేయడానికి ప్రత్యేకమైన మండపాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వర్షం కురిసిన రాత్రి ఈ ఆలయాన్ని సందర్శించినట్టయితే చాలా దివ్య మనోహరంగా ఉంటుంది. రాత్రివేళలో ఈ దేవాలయం అద్భుతమైన లైటులతో నిర్మించబడి ఉంటుంది.
రాత్రి సమయంలో ఆలయం దివ్య మనోహరంగా ఉండి చూపరులను కనువిందు చేస్తుంది. ఈ దేవాలయం భక్తులు కోరిన కోరికలు తీర్చేయడమే కాక సినిమాలో నిర్మించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
పక్కనే రామోజీ ఫిలిం సిటీ ఉండడం వల్ల టెంపుల్ సన్నివేశాలను ఇక్కడ ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఇతర ప్రాంతాల నుండి కొత్తగా హైదరాబాద్ వచ్చేవారు అలాగే రామోజీ ఫిలిం సిటీని సందర్శించే పర్యాటకులు విదేశీయులు ఈ ఆలయాన్ని సందర్శించి ఎంతో మనోహరమైన అనుభూతిని పొందుతున్నారు.
Sanghi Temple Timings Hyderabad
How to Reach Sanghi Temple సంఘీ టెంపుల్ ని ఎలా చేరుకోవాలి ?
By road రోడ్డు మార్గం ద్వారా : సంఘీ టెంపులు హైదరాబాదు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. హయత్ నగర్ బస్ స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది సంఘీ టెంపుల్. ఇక్కడికి చేరుకోవడానికి ఒక గంట నుండి రెండు గంటల టైం పడుతుంది. సికింద్రాబాద్ బస్ స్టేషన్ నుండి ఇక్కడ చేరుకోవడానికి చాలా బస్సులు అందుబాటులో ఉన్నాయి. మీకు సొంత వాహనం ఉన్నట్టయితే గూగుల్ మ్యాప్ ను ఉపయోగించి సంఘీ టెంపుల్ ని చేరుకోవచ్చు.
By train రైలు మార్గం ద్వారా : రైలు మార్గం ద్వారా అనుకునే వారికి ఘట్కేసర్ రైల్వే స్టేషన్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం.
By Air విమాన మార్గం ద్వారా : సంఘీ టెంపుల్ నుంచి చేరుకోవడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆఫీస్ దగ్గరలో ఉంది. ఎయిర్ పోర్ట్ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఎయిర్ పర్ట్ నుండి టాక్సీ అద్దెకు తీసుకొని ఈ ఆలయాన్ని ఒక గంట సమయంలో చేరుకోవచ్చు.
How many steps are in Sanghi Temple? సంఘీ టెంపుల్ ఎన్ని మెట్లు కలిగి ఉన్నది?. కారు గాని సొంత వాహనం గాని లేకుండా కాలినడక ద్వారా.మెట్లు ఎక్కి పైకి చేరుకోవాలనుకునే వారికి 175 మెట్లు ఎక్కి ఆలయాన్ని పైకి చేరుకోవచ్చు. ఈ మెట్ల ద్వారా మోకాళ్ళ మోకాళ్లపై నడిచి స్వామివారిని దర్శించుకుంటే సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు.
Best time to visit sanghi temple సంఘీ టెంపుల్ ని ఎప్పుడు సందర్శించాలి ?
సంఘీ టెంపుల్ ని ఉదయం 8 గంటల నుంచి వెళ్లి ఉదయం 10:30 వరకు దర్శించుకోవచ్చు అలాగే సాయంత్రం 4 గంటలు నుండి 6 గంటల వరకు సందర్శించవచ్చు వర్షం పడిన తర్వాత ఈ ఆలయాన్ని సందర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.
Is photography Allowed in Sanghi Temple? సంఘీ టెంపుల్లో కెమెరాలను ఫోటో తీసుకోవడం అనుమతిస్తారా ?
సంగీ టెంపుల్లో ఎలాంటి కెమెరాలు గాని ఫొటోస్ ను గాని వీడియోస్ గాని తీసుకోవడానికి అనుమతించరు. మీ యొక్క మొబైల్స్ కెమెరాస్ ని మొబైల్ కౌంటర్ సమర్పించవలెను.
ప్రతిరోజు సంఘీ టెంపుల్ ని ఎంతమంది దర్శించుకుంటారు ?
ప్రతిరోజు సంఘీ టెంపుల్ ని 1000మంది నుండి 2000 మంది దర్శించుకుంటారు. శని ఆదివారాల్లో మాత్రం 4 నుండి 5000 మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. శని ఆదివారాల్లో ఈ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
సంఘీ టెంపుల్లో సినిమా షూటింగ్ సమయంలో భక్తులని అనుమతిస్తారా ?
సంఘీ టెంపుల్ ఆరెకరాల విశాలమైన భూభాగంలో నిర్మించబడింది .ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్స్ దేవుని నమస్కరించుకోవడానికి మాత్రమే జరుగుతాయి. మీద షూటింగ్ అన్ని ఆలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలోనే జరుగుతాయి. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాన్ని కలగనివ్వరు.
సంఘీ టెంపుల్ ప్రత్యేక ఉత్సవాలు : సంఘీ టెంపుల్లో కార్తీకమాసంలో ఎక్కువ మది భక్తులు దర్శించుకుంటారు అలాగే ప్రతి సంవత్సరం జనవరి 1 రోజున అత్యధికంగా భక్తులైతే వస్తారు ఆరోజు చాలా ప్రత్యేకంగా దర్శనాలైతే ఉంటాయి.