Puri Jagannath Temple Hyderabad Timings
సోమవారం6:00 am – 11:00 am వరకు.
5:00 pm – 9:00 pm వరకు
మంగళవారం
6:00 am – 11:00 am వరకు
5:00 pm – 9:00 pm. వరకు
బుధవారం
6:00 am – 11:00 am వరకు
5:00 pm – 9:00 pm. వరకు
గురువారం
6:00 am – 11:00 am వరకు
5:00 pm – 9:00 pm. వరకు
శుక్రవారం
6:00 am – 11:00 am వరకు
5:00 pm – 9:00 pm. వరకు
శనివారం
6:00 am – 11:00 am వరకు
5:00 pm – 9:00 pm. వరకు
ఆదివారం
6:00 am – 11:00 am వరకు
5:00 pm – 9:00. Pm వరకు
హైదరాబాదులో జగన్నాథ ఆలయం నగరం నడిబొడ్డులోని బంజర హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది. ఇది ఒరిస్సా లోని పూరి జగన్నాథ టెంపుల్ ని పోలిన ఆలయం. ఈ ఆలయం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఈ ఆలయాన్ని ఎర్ర ఇసుకతో కట్టారు సుమారు 600 టన్నుల ఇసుకను ఒరిస్సా నుండి ఇక్కడికి తీసుకువచ్చారు.
ఈ ఆలయాన్ని 2009లో హైదరాబాదులో ఉన్న ఒడియా కమ్యూనిటీ నిర్మించింది. ఒరిస్సా లోని ప్రధాన ఆలయం లాగే పోలి ఉన్నపటికీ ఈ రెండు దేవాలయాల మధ్య వ్యత్యాసం ఉంది. జగన్నాథుడు అంటే మహావిష్ణువు ప్రతిరూపం. ఈ ఆలయానికి రెండు ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయంలో జగన్నాథుని టెంపుల్ తో పాటు ఇంకా కొన్ని ఐదు చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో లక్ష్మీదేవి శివుడు వినాయకుడు హనుమంతుడు మరియు నవగ్రహాలు ఉన్నాయి.
పూరీ ప్రధాన ఆలయంలో పాటించే అన్ని ఆచరణ నియమాలు ఇక్కడ కూడా పాటిస్తారు. ప్రతి సంవత్సరం జూలైలో ఈ ఆలయంలో రథయాత్ర తో పాటు బౌద్ధ యాత్రను కూడా నిర్వహిస్తారు. రథయాత్రకి వేలాదిమంది భక్తులు తరలివస్తారు.
ఈ ఆలయం ప్రత్యేకతలు : ఈ ఆలయం యొక్క శిఖరం 70 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి శని ఆదివారాల్లో ఆడియో అండ్ వీడియో విజువల్స్ షోను నిర్వహిస్తారు. రాత్రిపూట ఈ ఆలయాన్ని ప్రత్యేకమైన లైటులతో అలంకరిస్తారు. ఈ ఆలయాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతారు. సాయంత్రం సమయంలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
Location & address : Puri jagannatha Temple Banjara hills road number 12 ఉంది. పక్కనే తెలంగాణ భవన్ ఉంటుంది. KBR park వెనకలె ఈ టెంపుల్ ఉంటుంది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ కు అది సమీపంలో ఉంటుంది ఈ ఆలయం.
How to reach Puri jagannadha temple Hyderabad ?
సికింద్రాబాద్ నుండి మణికొండ వెళ్లే బస్సులు లేదా కొండాపూర్ హైటెక్ సిటీ వెళ్లే బస్సులు ద్వారా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ చేరుకొని అక్కడి నుండి ఆటోకు వెళ్ళవచ్చు.
47L ,127k గల బస్సులు (Bus ) ఈ రూట్ తిరుగుతాయి. అలాగే మెట్రో సౌకర్యం కూడా కలదు . ఈ ఆలయానికి సమీపాన గల మెట్రో స్టేషన్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి స్టేషన్. ఇక్కడి నుండి మీరు ఆటో కి వెళ్ళవచ్చును.
History of Puri Tagannadha Temple Orissa
ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం యొక్క చరిత్ర.
హిందూ మతంలో నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించడం చాలా పవిత్రమైన పనిగా భావిస్తారు. అందులో ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం కూడా ఒకటి.ఈరోజు ఆ ఆలయం గురించి తెలుసుకుందాం . సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు.దేశ విదేశాల నుంచి కూడా ఈ ఆలయం చూసేందుకు వస్తూ ఉంటారు. ఈ రోజు ఈ ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాన్ని తెలుసుకుందాం.
ఈ ఆలయానికి సంబంధించిన నిజాలు ఇప్పటివరకు చాలామందికి తెలియదు. ఈ ఆలయం పక్కనే సముద్రం ఉన్న ఆలయంలో సముద్ర ఘోష వినిపించదు. సముద్రపు అలల శబ్దం వినిపించాదు .ఎప్పుడు సమృద్ధిగా ప్రసాద విత్తరణ జరుగుతూ ఉంటుంది .లక్షల మంది వచ్చినా కూడా సరిపోతుంది. అందరికీ ప్రసాదం తప్పకుండా ఉంటుంది .జగన్నాథునికి ప్రసాదం పెట్టి ఆహార పదార్థాలని వండడం కోసం నిరంతరం ఆలయ కమిటీ పని చేస్తూనే ఉంటుంది. ఈ ఆలయంలో దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి.
మొత్తం ఎనిమిది వందల మంది మహా ప్రసాదాన్ని తయారు చేసే పనిలో ఉంటారు. ఈరోజుకి జగన్నాధ ఆలయంలో అనేక వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి. వీటికి సమాధానం ఎవరి దగ్గర లేదు. శ్రీకృష్ణుడు ఎప్పటికీ ఇక్కడ కొలువై ఉన్నాడని ప్రజలు నమ్ముతారు.
పురాతన కాలం నుండి ఇక్కడికి ప్రజలకు విష్ణుమూర్తి ఆరాధ్య దైవం. ఇక్కడ విష్ణుమూర్తి అవతారం ఇతర ఆలయాల కన్నా కొంచెం భిన్నంగా కనిపిస్తుంది .
నిరంతరం ఈ ఆలయం పైన జెండా గాలి వ్యతిరేక దిశలో రేప రేపలాడుతుంది. ప్రతిరోజు ఆలయ శిఖరాన ఉండే జెండాను మారుస్తారు. ప్రతిరోజు ఒక పూజారి ఆలయం పైకి ఎక్కి జెండాని మారుస్తూ ఉంటారు. జగన్నాధ ఆలయం శిఖరం పైన ఒక సుదర్శన చక్రం పెట్టి ఉంటుంది.ఈ ఆలయం ఎంత ఎత్తులో నిర్మితమైందో అంతే లోతు కూడా దాని అడుగుభాగం ఉందని విశ్వసిస్తారు. ఏడవ శతాబ్దంలో ఈ మందిర నిర్మాణం జరిగింది.
ఒక రాజుకి కలలో జగన్నాథుడు కనిపించి నీలాచల పర్వతాల్లోని ఒక గుహలో నా విగ్రహం ఒకటి ఉందని నన్ను నీల మాధవుడు అంటారు అని నాకు ఒక గుడి కట్టించి అందులో ఈ విగ్రహాన్ని పెట్టించమని అడుగుతాడు. రాజుగారు ఒక విశాలమైన ఎత్తయిన గుడిని నిర్మించి. ఆ విగ్రహాన్ని తయారు చేయించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆ విగ్రహం తయారు చేయడం ఎవరి వల్ల కాదు. చివరికి విశ్వకర్మ సహకారం తీసుకొని ఆ విగ్రహాన్ని తయారు చేయించాలని అనుకుంటాడు దానికి విశ్వకర్మ ఒక షరతు విధిస్తాడు .నేను విగ్రహం తయారు చేసే సమయంలో తలుపులు మూసి ఉంచవలెను
అలా విగ్రహం పూర్తయ్య వరకు ఆలయంలోకి ఎవరూ రాకూడదు. అని షరతు విధిస్తాడు. దానికి రాజుగారు సరేనని ఒప్పుకుంటాడు. ఇక విశ్వకర్మ ఆ విగ్రహాన్ని తయారు చేసే పనిలో ఉంటాడు. ఒకసారి రాజుగారు ఆ విగ్రహం పని ఎంతవరకు వచ్చిందో అని ఆలయం లోపలికి వెళ్లి దొంగ చాటుగా తలుపు దగ్గర నుండి శబ్దాలను విలాన వినాలని అనుకుంటాడు. కానీ ఆ ఆలయం లోపట నుండి ఎలాంటి శబ్దాలు వినిపించవు.
దాంతో ఆ రాజుకి అనుమానం వచ్చి విశ్వకర్మ పనిచేయడం మానేశాడని అసలు లోపల పని జరగడం లేదని భావించి తలుపులను పూర్తిగా తెరుస్తాడు. అలా ఇచ్చిన మాటను తప్పి నందుకు విశ్వకర్మ అక్కడి నుండి ఆ విగ్రహం తయారు చేసే పనిని మానుకొని మాయమైపోతాడు. అలా అసంపూర్తిగా మిగిలిపోయిన విగ్రహాన్ని అలాగే ప్రతిష్టించాలని ఆకాశం నుండి సందేహం వినిపిస్తుంది. ఇక చేసేదేమీ లేక ఆ రాజు అలా అసంపూర్తి గా ఉన్న విగ్రహాలనే ప్రతిష్టిస్తాడు. ఇప్పటికీ పూరి దేవాలయం లో అసంపూర్తిగా ఉన్న ఈ విగ్రహాలకే పూజలను నిర్వహిస్తారు.