శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 55 ప్రాంతంలో ఉంది . ఈ ఆలయం హైదరాబాదులోని ప్రసిద్ధి దేవాలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం బోనాల పండుగ సందర్భంగా ఈ ఆలయంలో భారీ ఉత్సవాలు జరుగుతాయి.
ఈ ఆలయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం ,కళ్యాణ మండపం, భక్తులు ఉండడానికి వసతి గృహాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో గజస్తంభం దగ్గర రూపాయి బిళ్ళను పడిపోకుండా నిలువుగా నిలబెడితే, మనం మనసులో కోరుకున్న కోరిక, నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
Peddamma talli Temple history : పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాదులో పురాతన ఆలయాల్లో ఒకటి.అమ్మవారు చాలా కాలంగా గ్రామ దేవతగా పూజలు అందుకునేదంట . ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకాంబరి, ఉత్సవాలు, దసరా, నవరాత్రి ఉత్సవాలు మరియు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.
ఈ సమయంలో అధికంగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడు. యజ్ఞ యాగాదుల్ని ధ్వంసం చేసేవాడు. దేవతల్ని పీడించేవాడు. ఆ రాక్షసుడు దాటికి దేవతలందరూ కలిసి అమ్మవారిని పాహిమాం పాహిమాం అంటూ అమ్మవారిని శరణు కోరారు. అలా అమ్మవారు ఆ రాక్షసుడిని యుద్ధంలో పోరాడి సంహరించింది. విజయం అమ్మవారిదే అయింది ఆ సుదీర్ఘ పోరాటంలో పోరాడి పోరాడి అలసిపోయిన అమ్మవారు కాస్త సేదదీరడం కోసం దట్టంగా ఉన్న అడవిలో నల్లని రెండు బండరాళ్ల మధ్యలో కొద్ది రోజులు సేద తీరింది. అదే ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంతమని స్థానికుల అభిప్రాయం.
ఒకప్పుడు జూబ్లీహిల్స్ ఆదిమ వాసులకు ఆవాసంగా ఉండేది అంట. ఇక్కడ దట్టమైన అడవిలో కొండ రాళ్ల మధ్యలో వేటే జీవనంగా బ్రతికే ఆ అమాయ ఆదివాసులకు అమ్మవారే కులదైవంగా ఉండేదట. మంచి జరుగుతే అమ్మవారికి కానుకలు ఇచ్చి పండుగ జరుపుకునే వారంట అలాగే చెడు జరుగుతే జంతు బలులతో శాంతులు జరిపించేవారు. అలా ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ వెలిసిందే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్.