చిలుకూరి బాలాజీ టెంపుల్ టైమింగ్స్ Chilkur Balaji Temple Timings

చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరి గ్రామంలో ఉంది. హైదరాబాద్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం చరిత్ర ప్రకారం ఈ దేవాలయాన్ని ఎక్కువమంది విదేశాలు వెళ్లాలని అనుకునేవారు వీసా తొందరగా రావాలని కోరుకునేవారు ఎక్కువగా దర్శించుకుంటారు.
 ఇందులో IT నిపుణులే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రతి 11 ప్రదక్షిణలకు ఒకసారి మీ యొక్క కోరికను కోరుకోవాలి. మీ కోరిక గనుక నెరవేరినట్లు అయితే మళ్లీ ఈ దేవాలయానికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేయాలి. విదేశాలకు వెళ్లాలని అనుకునే భక్తులే గాక అన్ని వర్గాల వారు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. 

దేశంలోనే ఉన్న అతికొద్ది అరుదైన దేవాలయాల్లో కూడా ఇది ఒకటి. ఈ దేవాలయంలో హుండీలు ముడుపులను స్వీకరించారు. ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణాలు చేయడమే పెద్ద ముడుపుగా నిర్వహణ భావిస్తారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతిరూపమే ఈ చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి అని భక్తులు నమ్ముతారు.

How to reach chilkur Balaji temple చిలుకూరి బాలాజీ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ? 

By road రోడ్డు మార్గం ద్వారా : హైదరాబాద్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది చిలుకూరు బాలాజీ ఆలయం.
హైదరాబాదులో మీరు ఎక్కడున్నా మొదట మెహిదీపట్నం చేరుకోవాలి అక్కడి నుండి మీకు చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి.బస్ నెంబర్ 288 గల బస్సు హైదరాబాద్ నుండి చిలుకూరు బాలాజీ వెళ్లే మార్గంలో సర్వీస్ ని అందిస్తుంది. 

By metro మెట్రో రైలు ద్వారా : చిలుకూరి బాలాజీ  దగ్గరగా ఉన్నటువంటి మెట్రో రైల్వే స్టేషన్ చిక్కడపల్లి మెట్రో రైల్వే స్టేషన్. ఇకనుండి మీరు 10 నుండి15 నిమిషా ల్లో ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు.

Best time to visit chilkuri Balaji temple : జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ నెలలో దర్శించుకోవడం ఉత్తమమైన సమయం.
 
Chilkur Balaji Temple timings : చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదయం 6 :00 AM  గంటల నుండి మధ్యాహ్నం 1:00 PM  వరకు తెరవబడి ఉంటుంది

మధ్యాహ్నం 1:00 PM నుండి మధ్యాహ్నం 3:00 PM  వరకు వరకు ఆలయాన్ని మూసివేస్తారు.

 మళ్లీ తిరిగి సాయంత్రం 4:00 PM గంటల నుండి సాయంత్రం 6:00 PM గంటల వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత దేవాలయాన్ని మూసివేస్తారు.

Is photography Allowed in chilkuri Balaji temple చిలుకూరి ఆలయంలోకి ఫోటో కెమెరాల్ని అనుమతిస్తారా? 
చిలుకూరి బాలాజీ దేవాలయంలోకి ఫోటోలను కెమెరాలు అనుమతిస్తారు ఇక్కడ మీ యొక్క జ్ఞాపకాలను ఫోటోల రూపంలో వీడియో రూపంలో తీసుకోవచ్చు.

Chilpur Balaji temple tickets :  చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎలాంటి టికెట్స్ ఉండవు VIP Tickets అంటూ ఏమీ ఉండవు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలో ఇది ఒకటి. అందరూ సమానంగానే ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఉచితంగా. 

చిలుకూరి బాలాజీ ఆలయంలో కేవలం ఐదు రూపాయలకే ఆధ్యాత్మికమైన అలాగే ఇతర పుస్తకాలను ఇక్కడ చదువుకోవచ్చును. అంతేకాకుండా ఈ ఆలయం పర్యావరణాన్ని పెంపొందించే అంశాల పైన కూడా అవగాహన కల్పిస్తుంది. సోలార్ పవర్ హార్వెస్టింగ్ రెయిన్ వాటర్ వంటి వంటి అంశాల పైన అవగాహన కల్పిస్తుంది. 
ఈ ఆలయాన్ని ప్రతి వారం 70,000 నుంచి 80,000 మంది దర్శించుకుంటారంట. ప్రతి ఏటా ప్రత్యేకంగా పౌర్ణమి రోజు బ్రహ్మోత్సవాలకు అలాగే పూలంగి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలు ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
 
History of chilkur Balaji temple చిలుకూరి బాలాజీ ఆలయం యొక్క చరిత్ర . ఈ ఆలయం యొక్క పురాణ గాధలను అనుసరించి గున్నాల మాధవి రెడ్డి అనే ఒక భక్తుడు ప్రతి సంవత్సరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి నీ దర్శించుకునే వాడంట. కానీ ఒక సంవత్సరం మాత్రం అతనికి అనారోగ్య కారణాలవల్ల శ్రీ తిరుమల దేవస్థానాన్ని చేరుకోలేక పోయాలంట. అలా తిరుపతి వెళ్లలేదని  ఆ భక్తుడు బాధ పడుతుంటే వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ,నేను మీ ఊర్లోనే ఉన్నటువంటి ఒక పుట్టలో వేలి శానని కల్లో చెప్పాడంట . నా విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాలని కోరాడంట. అలా భక్తుడు ఆ విగ్రహాన్ని బయటకు తీస్తున్న సమయంలో విగ్రహం నుండి రక్తం కారిందట తర్వాత ఆ విగ్రహాన్ని పాలతో కడిగించి అక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారంట. అలా అక్కడ చిలుకూరి బాలాజీ ఆలయం అనేది వెలిసింది అని పురాణాలు చెప్తున్నాయి.

గరుడ ప్రసాదం :  ప్రతి ఏడాది ఆలయంలో గరుడ ప్రసాదాన్ని ఇస్తారు . ఎవరైతే భక్తులకు సంతానం లేదు అలాంటి భక్తులు ఈ గరుడ ప్రసాద్ అని స్వీకరించినట్లయితే వారికి సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. అలాగే ఈ ఆలయం వెనకవైపు గోశాల ఉంది ఇందులో 40 నుంచి 50 వరకు ఆవులను పోషిస్తున్నారు.















Previous Post Next Post